ప్రకాశిస్తున్న భూమి.. ఫొటో షేర్ చేసిన నాసా 

ప్రకాశిస్తున్న భూమి.. ఫొటో షేర్ చేసిన నాసా 

చిన్నప్పుడు అమ్మ.. చందమామ రావె. జాబిల్లి రావే.. అంటూ అందమైన చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. అయితే, ఇప్పుడు భూమి ఫొటోలను చూపిస్తూ అన్న తినిపించాలేమో.. నాసా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన భూమి ఫొటోలు చూస్తే అలానే అనిపిస్తుంది మరి. రాత్రి పూట్ నీలం రంగులో, స్ట్రీట్ లైట్స్ వెలుగులో భూమి ఎంతో అందంగా కనిపిస్తోంది. 

చిమ్మ చీకట్లో కూడా భూమి చాలా ప్రకాశంగా కనిపిస్తుంది. ప్రతీ భూ భాగం స్ట్రీట్ లైట్స్ తో వెలిగిపోయి ఉంది. నాసా అంతరిక్షం నుంచి కంపోజిటింగ్ టెక్నిక్ ద్వారా ఈ ఫొటోలను తీశారు. అయితే, 2016 లో తీసిన ఫొటోతో పోల్చితే.. ప్రస్తుతం భూమి అంతా జనాభా పెరిగిపోయిందని, లైటింగ్ కూడా ఎక్కువైందని నాసా తెలిపింది. అయితే, ఈ పోస్ట్ ను నాసా కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంచింది.